తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు (అక్టోబర్ 14, 2026) ఉదయం శ్రీ మలయప్పస్వామివారు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
దేశం నలుమూలల నుంచి విచ్చేసిన కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తి, సంగీతం, నృత్యం, భారతీయ సంస్కృతీ సంప్రదాయాల సమ్మేళనంతో తిరుమాడ వీధులు ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని సంతరించుకున్నాయి.
సింహ వాహనసేవలో 10 రాష్ట్రాలకు చెందిన 17 కళాబృందాల నుంచి 491 మంది కళాకారులు తమ అద్భుత ప్రదర్శనలతో భక్తులను అలరించారు.


