విజయనగరం టౌన్: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న మొబైల్స్‌ను సైబర్ సెల్ పోలీసులు ట్రాక్ చేసి రూ.15లక్షల12వేల 500 విలువైన వివిధ బ్రాండ్లకు చెందిన 121 మొబైల్స్‌ను ఎస్పీ ఏఆర్.దామోదర్ చేతుల మీదుగా బాధితులకు మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల్లో బాధితులు పోగొట్టుకున్న మొబైల్స్ వివరాలను సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేసి, పోయిన మొబైల్స్‌ను ట్రాక్ చేసేందుకు ప్రత్యేకంగా మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్‌ను వినియోగిస్తున్నామన్నారు. బాధితులు స్థానిక పోలీసుస్టేషన్లో కానీ, సైబర్ సెల్లో గానీ నేరుగా పోర్టల్‌లో కానీ నమోదుచేయవచ్చన్నారు. మహిళలు తమ మొబైల్స్‌లో శక్తి యాప్‌ను తప్పనిసరిగా నిక్షిప్తం చేసుకోవాలని సూచించారు. మొబైల్ఫోన్లను ట్రాక్ చేసి, బాధితులకు అందజేయడంలో ప్రతిభ కనబర్చిన సైబర్ సెల్ సీఐ శోభన్‌బాబు, ఎస్సై ఆర్.జయంతి, సిబ్బంది శ్రీనివాసరావు, తిరుపతినాయుడు, రాజేష్, సతీష్‌లను ఎస్పీ అభినందించారు.


