అర్ధరాత్రి గంజాయిబాబుల అలజడి | - | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి గంజాయిబాబుల అలజడి

Oct 14 2026 11:28 AM | Updated on Oct 14 2026 11:28 AM

చీపురుపల్లి: అదేదో మారుమూల ప్రాంతం కాదు.. సాక్షాత్తూ చీపురుపల్లి పట్టణంలోని విజయనగరం–పాలకొండ మెయిన్‌రోడ్డులో సోమవారం అర్ధరాత్రి గంజాయి, మద్యం మత్తులో కొందరు యువకులు అలజడి సృష్టించారు. ఆ రోడ్డు గుండా వచ్చే వాహనచోదకులపై ఇష్టారాజ్యంగా ప్రవరిస్తూ భయాందోళనకు గురిచేశారు. ఆంజనేయపురం మెయిన్‌ రోడ్‌లో వచ్చే వాహనాలను అడ్డుకుని వికృతంగా ప్రవర్తించినట్టు చూసిన వారు చెబుతున్నారు. లారీలను అడ్డగించి కదలనివ్వకుండా వారి నుంచి డబ్బులు డిమాండ్‌ చేసినట్లు తెలిసింది. అదే రోడ్డులో ప్రయాణించే కార్లును సైతం అడ్డగించి అసభ్యకరంగా ప్రవర్తించారని పలువురు ప్రయాణికులు తెలిపారు. పట్టణంలోని మెయిన్‌రోడ్‌లో ఇంత జరుగుతున్నా పోలీసు గస్తీ లేకపోవడంపై పట్టణ ప్రజలు మండిపడుతున్నారు. మెయిన్‌రోడ్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక కాలనీల్లో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని పలువురు చర్చించుకుంటున్నారు. అదే సమయంలో చీపురుపల్లి పట్టణంలోని లావేరురోడ్‌లో ఐదు దుకాణాల్లో చోరీ జరగడం సైతం చర్చాంశనీయాంశంగా మారింది.

చీపురుపల్లి మెయిన్‌ రోడ్‌లో వాహనాలు అడ్డగించి హడావిడి

కానరాని పోలీస్‌ పెట్రోలింగ్‌

భయాందోళనలకు గురైన

వాహనచోదకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement