● శాఖల సమన్వయంతో
విజయవంతంగా నిర్వహించాలి
విజయనగరం గంటస్తంభం: స్వాతంత్య్ర వేడుకలను దేశభక్తి ఉట్టిపడేలా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఏర్పాట్లను లోపాలు లేకుండా పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించే శకటాలు, స్టాళ్లు, సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకునేలా ఉండాలని చెప్పారు. వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను ప్రశంసా పత్రాలతో సత్కరిస్తామన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని వెల్లడించారు.
సంక్షేమాన్ని విస్మరించి..
ప్రచారానికి ప్రాధాన్యమా?
విజయనగరం టౌన్: గిరిజన విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరించి ప్రచార కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వడం దారుణమని, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గిరిజన విద్యార్థుల సమస్యలను గాలికి వదిలేశారని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సహాయ కార్య దర్శి ఎన్.నాగభూషణం ధ్వజమెత్తారు. విజయనగరంలోని అమర్‌భవన్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది యోగాంధ్ర పేరుతో సుమారు 45వేల మంది గిరిజన విద్యార్థులను, ఈ ఏడాది భోగాపురం విమానశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా సుమారు 13వేల మంది గిరిజన విద్యార్థులతో థింసా నృత్యం చేయించడం గిరిజన విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడమేనని విమర్శించారు. గిన్నిస్‌బుక్ రికార్డులు, ప్రచార ఆర్భాటాల కోసం కాకుండా గిరిజన విద్యార్థుల విద్య, ఆరోగ్యం, భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్య మివ్వాలని కోరారు. రాష్ట్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో పాముకాట్లు, విష జ్వరాలతో విద్యార్థులు మరణిస్తున్నారని, అనేక చోట్ల ఫ్యాన్‌లు, తాగునీరు, వైద్య సదుపాయాలు కూడా లేవన్నారు. గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్యసేవలు లేక విద్యార్థులు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం వంటి ప్రాంతాలకు వెళ్లి చికిత్స పొందాల్సిన పరిస్థితి నెలకొందని ఆవే దన వ్యక్తం చేశారు. గిరిజన వర్సిటీ పనుల పురోగతిపై మంత్రి సంధ్యారాణి దృష్టిపెట్టకపోవడం విచారకరమన్నారు. ప్రచార కార్యక్రమాలకు ఖర్చుచేసే నిధులను గిరిజన విద్యార్థు ల సంక్షేమం, ఆశ్రమ పాఠశాలల అభివృద్ధి, వై ద్యసదుపాయాలు, మౌలిక వసతుల కల్పనకు వినియోగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుమన్, ఉపాధ్యక్షులు ఎ.చరణ్‌తేజ, వి.గణేష్, సహాయ కార్యదర్శి గౌరీశంకర్, పాల్గొన్నారు.


