● భయపెడుతున్న
మలేరియా
● జూలైలో అత్యధికంగా 229 కేసుల నమోదు
● ఆందోళనలో
జనం
● భయపెడుతున్న మలేరియా
● జూలైలో అత్యధికంగా 229 కేసుల నమోదు
● ఆందోళనలో జనం
విజయనగరం ఫోర్ట్:
జిల్లా ప్రజలపై మలేరియా పంజా విసురు తోంది. అస్వస్థతకు గురిచేసి మంచం పట్టిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో అధికంగా వ్యాప్తిచెందే మలే రియా జ్వరాలు ఇప్పుడు మైదాన ప్రాంత ప్రజలను సైతం కలవరపెడుతున్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాగా ఉన్నప్పుడు 8 మండలాల్లో గిరిజన ప్రాంతం విస్తరించి ఉండేది. ఇప్పుడు గంట్యాడ, ఎస్.కోట, మెంటాడ మండలంలోని కొన్ని గ్రామా ల్లో మాత్రమే గిరిజన ప్రాంతం ఉంది. అయినప్పటికీ మలేరియా కేసులు ఎక్కువగా నమోదు కావడం ఇటు ప్రజలు, అటు వైద్య వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. పారిశుద్ధ్యలోపం, రోజుల తరబడి మురునీరు నిల్వ ఉండడం, కలుషిత నీటి సరఫరా వంటివి జ్వరాల వ్యాప్తికి కారణాలుగా కనిపిస్తున్నాయి. పల్లెల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రభుత్వం అలసత్వం వహిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
జేబులకు చిల్లు..
సాధారణంగా వైరల్ జ్వరం అయితే రెండు, మూడు రోజుల్లో తగ్గిపోతుంది. మలేరియా జ్వరం వారం నుంచి 10 రోజుల వరకు తగ్గడం లేదు. కొంతమందికి అయితే 15 నుంచి 20 రోజులు పడుతోంది. ప్రభుత్వాస్పత్రుల్లో అయితే రోగులకు ఉచితంగా వైద్యం అందుతుంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో అయితే రోగులకు వైద్యఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. మలేరియా చికిత్సకు కొన్ని ఆస్పత్రుల్లో రూ.20 వేలు నుంచి రూ.30 వేలు వరకు తీసుకుంటున్నారు. మరికొన్ని ఆస్పత్రుల్లో రూ.30 వేలు నుంచి రూ.40 వేలు వరకు తీసుకుంటున్నారు. వెంటిలేటర్‌పై చికిత్స అవసరం అయితే రూ.లక్షల్లో బిల్లు చెల్లించాల్సి వస్తోంది.
వైద్యారోగ్యశాఖ లెక్కల ప్రకారం నెలవారీగా మలేరియా కేసుల వివరాలు...
మలేరియా కేసుల సంఖ్య
సీజనల్ వ్యాధుల వ్యాప్తి జూలై నుంచి ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది జనవరి నెల నుంచి జ్వరాల వ్యాప్తి సాధారణంగా మారింది. ఇప్పటివరకు జిల్లాలో 405 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఒక్క జూలై నెలలోనే 229 కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ కేసులు కూడా ప్రభుత్వాస్పత్రుల్లో నమోదైనవే. ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదైనవి పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్యకు రెట్టింపు ఉంటుంది.
జ్వరాలతో
సతమతం


