● మడ్డువలస ప్రాజెక్టు అధికారులను
నిలదీసిన రైతులు
● ఎండుతున్న నారుమడిని చూపించి ఆవేదన
సంతకవిటి: మడ్డువలస ప్రధాన కాలువ పరిధి
సంతకవిటి మండలంలో దాదాపు 11 వేల ఎకరాల ఆయకట్టు ఉంది.. ప్రధాన కాలువ నుంచి సోమన్నపేట వద్ద ఉన్న 24 ఎల్ కాలువకు చుక్కనీరు రావడం లేదు.. వరి నారు ఎండిపోతున్నా పట్టించుకోరా అంటూ శ్రీహరినాయుడుపేట, ఎస్.అగ్రహారం గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. వాస్తవ పరిస్థితిని మడ్డువలస ఈఈ బి.గోవిందరావు, డీఈఈ పి.రవికుమార్, ఏఈఈ బి.కోటేశ్వరరావుకు సోమవారం చూపించారు. కాలువకు నీరు విడిచిపెట్టి 11 రోజులైనా పొలాలకు చేరలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కాలువల నిర్వహణ సరిగా లేకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు గండేటి కేసరి, వైఎస్సా ర్‌సీపీ మండల యువజన విభాగం అధ్యక్షుడు దా సరి దాలినాయుడు అధికారులకు తెలియజేశారు. దీనిపై వారు స్పందిస్తూ మంగళవారం నాటికి శ్రీహరినాయుడుపేట, ఎస్.అగ్రహారం భూములకు నీ రందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


