ఈ చిత్రం చూశారా.. ఇది సాలూరు మండలం పట్టుచెన్నూరు పంచాయతీ నిమ్మలపాడు ప్రాథమిక పాఠశాల. ఈ చిన్న రేకుల షెడ్డే పాఠశాల పక్కా భవనం. తుడిచిన నేలే చిన్నారులకు టైల్స్ గచ్చు. ఇక్కడే ఒకటి నుంచి ఐదు తరగతుల విద్యార్థులకు విద్యాబోధన. సాక్షాత్తు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో గిరిజన పిల్లల చదువు కష్టాలకు ఈ చిత్రమే సజీవసాక్ష్యం. ప్రధాని మోదీ మెప్పుకోసం గిరిజన పిల్లలను మండే ఎండలో థింసా నృత్యం చేయించి సంబరపడిపోయే పాలకులు... పిల్లల చదువు కష్టాలపై దృష్టిసారించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. – సాలూరు రూరల్


