నో క్యాష్‌..! | - | Sakshi
Sakshi News home page

నో క్యాష్‌..!

Jan 12 2026 6:31 AM | Updated on Jan 12 2026 6:31 AM

నో క్

నో క్యాష్‌..!

నో క్యాష్‌..!

ఏటీఎంల వద్ద దర్శనమిస్తున్న బోర్డులు

పట్టించుకోని బ్యాంకర్లు

పండగపూట అవస్థలు పడుతున్న ఖాతాదారులు

రాజాం: పారిశ్రామికంగా అబివృద్ధిచెందుతున్న రాజాం పట్టణంలో ఏటీఎంల సమస్య వెంటాడుతోంది. పట్టణ కేంద్రంలో 27కు పైగా పలు బ్యాంకుల ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. ఈ ఏటీఎంలను హడావుడిగా పెట్టిన బ్యాంకులు మాత్రం వాటి నిర్వహణ మాత్రం పట్టించుకోవడంలేదు. వేలకు వేలు అద్దెలు చెల్లించడమే తప్ప ఖాతాదారులు సకాలంలో నగదు తీసుకోవాలంటే ఉపయోగపడని పరిస్థితి చాలా ఏటీఎం కేంద్రాల వద్ద కనిపిస్తోంది.

పండగ పూట నో బ్యాలెన్స్‌

రాజాం పట్టణంలో ఎస్‌బీఐ ప్రధాన బ్రాంచి కార్యాలయం వద్ద ఏటీఎం సెంటర్‌ నిత్యం రద్దీగా ఉంటుంది. ఇక్కడ సెక్యూరిటీ గార్డుల హడావుడి అధికంగా ఉంటుంది. నాలుగు మిషన్లలో రెండు మాత్రమే పనిచేస్తాయి. ఇదే బ్రాంచికి చెందిన మరో ఐదు ఏటీఎం సెంటర్ల వద్ద ఒక్క ెసెక్యూరిటీ గార్డు కూడా ఉండడం లేదు. బొబ్బిలిరోడ్డులోని ఈ బ్రాంచి ఏటీఎం మిషన్‌ను రోడ్డు విస్తరణలో ఎత్తివేయగా, ఇంతవరకూ కొత్తది పెట్టలేదు. పాలకొండ రోడ్డులోని ఈ బ్రాంచికి చెందిన ఓ ఏటీఎం సెంటర్‌ వద్ద ముందు తలుపులు పూర్తిగా పోయాయి. ఇక్కడ రక్షణ లేకపోయినా స్థానిక బ్రాంచి అధికారులకు, మనీలోడింగ్‌ అధికారులకు కానరాకపోవడం విశేషం. ఇంకో వైపు కెనరా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూనియన్‌బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, సెంట్రల్‌ కార్పొరేషన్‌ బ్యాంకులకు చెందిన ఏటీఎంలు కూడా పలుచోట్ల మొరాయిస్తున్నాయి. వాటిలో నగదు నిల్వ కూడా ఉండడంలేదు. సకాలంలో వాటి ద్వారా లబ్ధిపొందాలనుకునే ఖాతాదారులు మాత్రం చుక్కలు చూస్తున్నారు. ప్రస్తుతం సంక్రాంతి పండగతో ప్రజలు, రైతులు, ఉద్యోగులు ఈ ఏటీఎం కేంద్రాల చుట్టూ డబ్బులు తీసేందుకు తిరుగుతుండగా, ఎక్కడా క్యాష్‌ ఉండడంలేదు. ఓ వైపు బ్యాంకుల వద్ద రద్దీ, సెలవులు, మరో వైపు పనిచేయని ఏటీఎంలు, పనిచేసే చోట నో క్యాష్‌ ఇలా రాజాం పట్టణంలో నగదుకు చాలా ఇబ్బంది పడుతున్నామని పలువురు వాపోతున్నారు.

ప్రతి కేంద్రానికి తిరుగుతుండాలి

రాజాం పట్టణంలో ఏటీఎంలు ఒక్కో దఫా సరిగ్గా పనిచేయవు. నాలుగైదు దగ్గర్లకు వెళ్లినా డబ్బులు రావు. ఒక్కో దఫా జామ్‌ అవుతుంటాయి. నిర్వహణ సక్రమంగా ఉండదు. అంతా దుమ్ము, ధూళితో పాటు శునకాలు ఉంటాయి. ఎన్నో ఏటీఎంలు ఉన్నా నగదు నిల్వ కొన్నిచోట్ల మాత్రమే ఉంటుంది.

శనపతి రాము, పొగిరి, రాజాం మండలం

ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడంలేదు

రాజాంలోని ఏటీఎంలలో పరి శుభ్రత పూర్తిగా లోపించింది. కొన్ని మిషన్లు ఎప్పుడూ సర్వర్‌ డౌన్‌ అని చూపిస్తుంటాయి. ప్రధాన బ్యాంకులకు చెందిన ఏటీఎం మిషన్లలో కూడా నగదు ఉంచరు. పండగపూట ఉద్యోగులు అంతా ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయాల్లో ఇక్కడ ఏటీఎంలను నమ్ముకుంటే ఇబ్బంది తప్పదు. కుదమ తిరుమలరావు,

ప్రభుత్వ ఉపాధ్యాయుడు, రాజాం

నో క్యాష్‌..!1
1/4

నో క్యాష్‌..!

నో క్యాష్‌..!2
2/4

నో క్యాష్‌..!

నో క్యాష్‌..!3
3/4

నో క్యాష్‌..!

నో క్యాష్‌..!4
4/4

నో క్యాష్‌..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement