విజయనగరం | - | Sakshi
Sakshi News home page

విజయనగరం

Jan 12 2026 6:28 AM | Updated on Jan 12 2026 6:28 AM

విజయనగరం

విజయనగరం

సోమవారం శ్రీ 12 శ్రీ జనవరి శ్రీ 2026 నో క్యాష్‌..!

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 12 శ్రీ జనవరి శ్రీ 2026

పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న రాజాం పట్టణంలో ఏటీఎంలలో నో క్యాష్‌ సమస్య

వెంటాడుతోంది.

IIలో

సాక్షి,ప్రతినిధి, విజయనగరం:

శలు మూటలు నెత్తిన మోస్తూ.. గతంలో తాము నడిచివెళ్లిన బాటల్లో ఆనందపు అడుగులను వెతుక్కుంటూ.. పెద్దపండగకు ఒక్కొక్కరుగా భాగ్యవంతులు ఇంటిల్లిపాదీ చేరుకుంటున్నారు. వారిని వలసకూలీలని సామాజికవేత్తలు అంటున్నా.. నా లాంటి అల్ప సంతోషుల దృష్టిలో వారు నిజమైన భాగ్యవంతులు. వాళ్లంతా ఇక్కడ బతకలేని పేదల ని మేధావులు పేర్కొంటున్నా.. నా లాంటి సామా న్యులకు మాత్రం వాళ్లంతా తమ బతుకులు బాగుచేసుకునేందుకు జిల్లాల హద్దులు దాటిన శ్రమజీవులు. ఏ పల్లెలో చూసినా వారి ముచ్చటే ఎక్కువ. అక్కడ రాత్రీపగలూ శ్రమించి సంపాదించిన నాలుగు రూపాయలతో ఊరిలో ఆనందంగా గడుపుతా రు. సంక్రాంతి తమదే అన్న రీతిన ఊరంతా కలియతిరిగి తిరుగుప్రయాణమవుతారు. ఊళ్లలోకి వచ్చిన భాగ్యవంతుల ముచ్చటకు ‘సాక్షి’ అక్షర రూపం.

హైదరాబాద్‌ నుంచి వచ్చిన అప్పలనాయుడు, లక్ష్మి, నాయుడి వీరకాడు నారాయణ.. వీధి మధ్యన దమట ముట్టించి చుట్టూ కూర్చుని కబుర్లు మొదలెట్టారు.. మరేటిబావా హైదరాబాద్‌లో అంతా బాగు న్నట్టేనా.. అన్న నారాయణ ప్రశ్న పూర్తి కాకుండానే లక్ష్మి అందుకుని.. పర్లేదన్నయ్యా.. ఇద్దరం డ్యూటీకి వెళ్తాం.. మాతోబాటే మా మహేష్‌ కూడా వస్తాడు. ముగ్గురికి బాగానే వస్తాది.. ఆదివారం సెలవు.. ఒకరి జీతం అద్దెకి.. ఖర్చులకు పోయినా.. రెండు జీతాలు మిగుల్తాయి. ఆ డబ్బులతోనే కదా ఈ ఇల్లు పునాదులు, రేకులు వేయడం, పెద్దదాని పెళ్లి అప్పు లక్షన్నర తీర్చడం.. చిన్నదాని నర్స్‌ ట్రైనింగ్‌.. అంతా దాన్లోంచే అంటున్నప్పుడు ఒకనాడు వంద నోటును అబ్బురంగా చూసిన పేదరికాన్ని కష్టంతో దాటుకొచ్చాము అంటున్న లక్ష్మి ఆత్మవిశ్వాసం కని పిస్తుంది. అంతలోనే లక్ష్మి మళ్లీ అందుకుని తిండికి.. గుడ్డకు లోటు లేదన్నయ్యా.. మీ బావకు మాత్రం వారానికి మూడ్రోజులు మాంసాహారం ఉండాలి అంటున్నప్పుడు.. ఆరేడేళ్లు కిందట ఇదే ఊరిలో అడ్డెడు బియ్యం.. తవ్వెడు నూకలికి ఇల్లిల్లూ తిరిగిన జ్ఞాపకాన్ని మర్చిపోలేదు అంటూనే ఇప్పుడు మేం అలా లేం.. మేం కష్టంతో స్థాయిని పెంచుకున్నాం అంటుంది.. పోనిలేరా ఊరిలో అయినోళ్ల ముందు చెడి.. చెయ్యిచాచి బతకడం కన్నా ఊరుదాటి బాగుపడడం మేలని నారాయణ చెబుతుండగా పక్కింటి వదిన చేటలో చెత్త పెంట మీద పారేస్తూ దమటకాడికి వస్తూనే ఏటీ లచ్చిమొదినా.. చెవులోవి కొత్తవా ఏటి అంటూ పలకరించినప్పుడు..

లక్ష్మి మొహం సంతోషంతో వెలిగిపోయింది. అవును మంగొదినా.. ఇన్నాళ్లకు అరుతులం చెయిను, అరుతులం జుంకాలు చేయించాడు మీ అన్న య్య అని చెబుతూ... భర్తను మురిపెంగా చూస్తుంటే దమట వెలుగులో జుంకాలు మరింత మెరుస్తూ కనిపించా యి. ఇదిగో ఈ చీర్లన్నీ పెద్దషాపు లో కొనేశాం ఒకేసారి అంటున్నప్పుడు.. అప్పట్లో పాత చీరలకోసం తెలిసినవాళ్లను అడిగిన లక్ష్మి గొంతు నుంచి.. మాకిప్పు డా అవసరం లేదన్న భరోసా వినిపించింది. మొన్నామధ్య యాదగిరి వెళ్లాం.. తిరుపతి కన్నా పెద్దది తెలుసా... అని చెబుతున్నప్పుడు.. మేం.. విహారయాత్రలకూ వెళ్తాం.. మేం అప్పట్లా లేం..అనే ధీమా ముప్పిరిగొంటుంది.

పాత్రల పేర్లు మారతాయేమో కానీ ఉమ్మడి విజయనగరంలోని పలు గ్రామాల్లో ఇలాంటి కుటుంబాలు ఉన్నాయి.. ఆరేడేళ్లు కిందట పూటపుటనూ లెక్కించుకుని జీవించే వందలాది కుటుంబాలు.. కాలాన్ని నిందించలేదు. ప్రభుత్వాలను తిట్టలేదు. కష్టాన్ని నమ్ముకుని ట్రైన్‌.. బస్సు ఎక్కి.. పని ఉన్న చోటకు వెళ్లాయి. రైస్‌ మిల్లులు.. నూలు మిల్లులు.. టాబ్లెట్స్‌.. ప్లాస్టిక్‌ కంపెనీలు.. చేపలు.. రొయ్యల చెరువులు.. ఫామ్‌ హౌస్‌లు, కోళ్లఫారాలు.. డైరీ ఫారాలు.. ఎక్కడ పనిదొరికితే అక్కడ చేరిపోయాయి. పాపం అమాయకులు. నిజాయితీగా ఒళ్లొంచి పని చేస్తారు.. అందుకేనేమో కొద్దిరోజుల్లోనే యజమానులకు ఇష్టులైపోయారు.. చాలామందికి.. చిన్నపాటి షెడ్‌.. ఇల్లు.. రేషన్‌ కూడా యజమానులే ఇస్తారు. ఇక ఖర్చేముంది.. మూణ్ణాలుగేళ్లు తిరిగేసరికి తమ జీవితం మారుతుందన్న.. మారిందన్న తేడా వాళ్లకే స్పష్టంగా కనిపిస్తోంది. రూ.కోట్లు లేకపోవచ్చు.. రూ.లక్షలూ అక్కర్లేదు.. శ్రమే పెట్టుబడి.. మూడేళ్లు తిరిగేసరికి మెల్లగా చేతిలో డబ్బు కనిపిస్తుంది.. తమ అభివృద్ధి తమకే తెలుస్తోంది.. ఓపికున్నన్నాళ్లు చేద్దాం.. ఊళ్లోకొచ్చిమాత్రం చేసేదేముందన్న ధీమా.. కష్టంలోనే ఆనందం.. వచ్చే జీతంలోనే సంతోషం.. ఆ పక్కనే సంబరం.. ఇంతకన్నా భాగ్యవంతులెవరు.. డబ్బుమాత్రమే ఉన్నోళ్లు ధనవంతులు అవుతారు. జీవితంలో అన్ని కోణాలూ.. అన్ని భావాలూ.. అన్ని ఎత్తుపల్లాలూ చూసి తమను తాము గెలిచిన వాళ్లు భాగ్యవంతులే...

ఓ రాసీరాయని పెన్నుతో వీళ్ల జీవనరేఖలను బ్రహ్మ తన ఇష్టానుసారం రాసేస్తుంటే బ్రహ్మచేతిని ఒడిసి పట్టుకుని అలాక్కాదు... మా రాత మేం రాసుకుంటాం.. నువ్‌ పక్కకేళ్లు స్వామీ అని గదమాయించి తమ రేఖలను భాగ్యరేఖలుగా మార్చుకున్న కుటుంబాలు కోకొల్లలు... వీళ్లెవరూ పేదలు కారు... అవును పేదలు కారు... అక్షరాలా శ్రామికులు.. కార్మికులు...

కృషి.. శ్రమ ఉన్న చోట పేదరికం ఉండదు. దానికి వీళ్లంటే భయమెక్కువ.. పారిపోతుంది.. ఎక్కడికి.. ఇంకెక్కడికి.. సోమరిపోతుల దగ్గరకు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement