అలజడి..!
● వాయుగుండం ప్రభావంతో అలుముకున్న మేఘాలు ● కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు ● ధాన్యం తడిచిపోతాయని రైతుల ఆందోళన ● వరి నూర్పులు పూర్తయి పొలాల్లోనే ఉన్న ధాన్యం ● ధాన్యం కొనుగోలులో చంద్రబాబు సర్కార్ అలసత్వం
ఈ ఫొటోలో ధాన్యం బస్తాలపై టార్పలిన్ కప్పుతున్న రైతు పేరు భైరాగినాయుడు. ఇతనది గంట్యాడ మండలం పెదవేమలి గ్రామం. వరి నూర్పులు పూర్తయి పది రోజులైంది. ఇంత వరకు ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో పొలంలోనే ధాన్యం బస్తాలు ఇలా ఉండిపోయాయి. వాయుగుండం కారణంగా చిన్న చిన్న చిరుజల్లులు కురవడంతో ధాన్యం తడిచిపోకుండా ఇలా టార్పలిన్ కప్పారు.


