నేడు చదురుగుడికి శంబర పోలమాంబ
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారు శంబర గ్రామంలోని చదురుగుడికి సోమవారం చేరుకోనున్నారు. ఈ నెల 7వ తేదీన శంబర పోలమాంబ అమ్మవారిని కొనితెచ్చేందుకు చాటింపు వేయగా, సోమవారం సాయంత్రం గోముఖి నది ఒడ్డున ఉన్న అమ్మవారి గద్దె నుంచి మేళతాళాలు, భక్తులు జయ,జయధ్వానాల మధ్య చదురుగుడికి అమ్మవారు చేరుకోనున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను ఈవో బి.శ్రీనివాస్, ట్రస్ట్‌బోర్డు సభ్యులు చేశారు. అమ్మవారు సోమవారం చదురుగుడికి చేరుకుని, మంగళవారం కాళ్లునొప్పుల కారణంగా ఆలయంలో విశ్రాంతి తీసుకుంటారు. బుధవారం నుంచి గ్రామంలోని చదురుగుడిలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు. ఈ నెల 26న తొలేళ్ల ఉత్సవం, 27న సిరిమానోత్సవం, 28న అనుపోత్సవం నిర్వహిస్తారు.
బొబ్బిలి: పట్టణానికి చెందిన కార్టూనిస్టు గుంట్రెడ్డి భాస్కరరావుకు మరో అరుదైన గుర్తింపు దక్కింది. సూళ్లూరుపేటలో విదేశీ పక్షులను స్వాగతిస్తూ అక్కడి ఫ్లెమింగో క్లబ్ రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో భాగంగా గుంట్రెడ్డి తాను గీసిన కార్టూన్‌ను ప్రదర్శించారు. దీనికి ఉత్తమ కార్టూన్‌గా గుర్తింపు దక్కింది. మొత్తం 61 ఎంట్రీలలో గుంట్రెడ్డి గీసిన కార్టూన్ ముందు భాగంలో నిలిచింది. అక్కడి సాహితీవేత్తలు, ఇక్కడి అభిమానులు భాను కార్టూన్‌ను ప్రశంసించారు.
నేడు చదురుగుడికి శంబర పోలమాంబ


