పెండ్లి కుమార్తెగా గోదాదేవి
ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా జామి మండలం అన్నంరాజుపేటలోని పుష్పగిరి వేణుగోపాలస్వామి ఆలయంలో గోదాదేవి అమ్మవారిని వేదమంత్రాల నడుమ పెండ్లి కుమార్తెగా ఆదివారం ముస్తాబు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు ఫణిహరం సీతారామచార్యులు ఆధ్వర్యంలో ముందుగా అమ్మవారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. 108 మంది ముత్తయిదవులతో పసుపు దంపించి అమ్మవారిని పెండ్లి కుమార్తెగా అలంకరించారు. అనంతరం 108 గిన్నెలతో కూడరై నివేదన సమర్పించారు. అమ్మవారికి తిరువీధి ఉత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. – జామి


