నైపుణ్యంతోనే రాణింపు
చీపురుపల్లిరూరల్ (గరివిడి):
ఏ రంగంలోనైనా నైపుణ్యం ప్రధానమని, విద్యార్థులు వారు ఎంచుకున్న రంగంలో నైపుణ్యం పెంపొందించుకుంటే భవిష్యత్‌లో రాణిస్తారని తిరుపతి వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ జె.వి.రమణ అన్నారు. గరివిడి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ కళాశాలలో గత ఐదురోజులుగా జరుగుతున్న 14వ అంతర కళాశాలల క్రీడా సాంస్కృతిక పోటీలు శనివారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో క్రీడా సాంస్కృతిక, సాహిత్య పోటీల్లో విజేతలుగా నిలిచిన పలు కళాశాలల విద్యార్థులకు ఆయన బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. విద్య, క్రీడలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందిస్తాయని, అభివృద్ధికి దోహదపడతాయన్నారు. పశుసంవర్థక శాఖ సంయుక్త సంచాలకుడు డా.కె.మురళీకృష్ణ మాట్లాడుతూ పశువైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు మూగజీవాలకు అందించాల్సిన వైద్యసేవలన్నీ నేర్చుకోవాలని సూచించారు. వెటర్నరీ కళాశాల అసోసియేట్ డీన్, మండల సమాఖ్య ప్రధాన కార్యదర్శి డా.మక్కేన శ్రీను ఆధ్వర్యంలో జరిగిన క్రీడా, సాంస్కృతిక పోటీల్లో ముఖ్య అతిథులుగా డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ వి.వైకుంఠరావు, వై.బాబూరావు, బి.జయచంద్ర, ఎం.రవి, వై.ఆర్.అంబేడ్కర్, పలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీ
వీసీ జె.వి.రమణ
ముగిసిన 14వ వెటర్నరీ అంతర
కళాశాలల క్రీడా సాంస్కృతిక పోటీలు
ఓవరాల్ చాంపియన్‌గా తిరుపతి వెటర్నరీ కళాశాల విద్యార్థులు
ఓవరాల్ చాంపియన్ షిప్ విజేతలు వీరే...
క్రీడా, సాంస్కృతిక పోటీల్లో ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను బాలుర, బాలికల విభాగంలో తిరుపతి వెటర్నరీ కళాశాల కై వసం చేసుకుంది. కల్చరల్, లిటరరీ విభాగాల్లో ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను గరివిడి వెటర్నరీ కళాశాల దక్కించుకుంది. తిరుపతి వెటర్నరీ కళాశాలకు చెందిన ఎన్.విష్ణు ఇండివిడ్యువల్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నాడు. అథ్లెటిక్స్‌లో గరివిడి వెటర్నరీ కళాశాలకు చెందిన ఎం.ప్రణీత, తిరుపతి వెటర్నరీ కళాశాలకు చెందిన జి.అంజలి బాలికల విభాగంలో ఇండివిడ్యువల్ చాంపియన్‌షిప్‌ను సాధించుకున్నారు.
నైపుణ్యంతోనే రాణింపు


