గుంతలే మిగిల్చారు..!
ఈ చిత్రంలో నడకకు కూడా పనికిరాని రోడ్డు చూశారా.. జామి మండలం యాతపాలెం వద్ద రోడ్డుపై మెటల్ వేసి ఇలా వదిలేశారు. ఏడాది గడు స్తున్నా నిర్మాణం పూర్తి చేయలేదు. రోడ్డు మొత్తం రాళ్లు తేలిపోవడంతో బైక్‌పై కూడా వెళ్లలేని పరిస్థితి. సాహసించి ప్రయాణిస్తే టైర్లకు పంక్షర్లవుతున్నాయని, చేతిచమురు వదులుతోందంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్నది తెర్లాం–బలిజిపేట మండలాలను కలిపే పణుకువలస కూడలి–వంతరాం ఆర్‌అండ్‌బీ రోడ్డు. సుమా రు 9 కిలో మీటర్లపైనే ఉంటుంది. వేలాది మంది రాకపోకలకు ఈ రోడ్డే ఆధారం. పణుకువలస కూడలి నుంచి కొల్లివలస వరకు రోడ్డంతా పూర్తిగా గోతులమయమైయింది. తరచూ వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయి. సంక్రాంతికి ఈ రోడ్డును అద్దంలా మెరిపిస్తామన్న నాయకులు ఏడాదిన్నరగా కనిపించకుండా పోయారంటూ ఈ ప్రాంతీయులు విమర్శిస్తున్నారు.
గుంతలే మిగిల్చారు..!
గుంతలే మిగిల్చారు..!


