పాదయాత్రగా అప్పన్న సన్నిధికి
కొత్తవలస: మండలంలోని మంగళపాలెం గ్రామ సమీపంలోని గురుదేవా చారిటబుల్ ట్రస్టు నుంచి తరికొండ వెంగమాంబ భజన బృందం ఆధ్వర్యంలో గిరిపుత్రులు సింహాచలంలోని అప్పన్నసన్నిధికి శనివారం పాదయాత్రగా చేరుకున్నారు. దారిపొడవునా భక్తిగీతాలు ఆలపించారు. భజనలు చేశారు. వీరికి ట్రస్టు ఆధ్వర్యంలో మంచినీరు, మజ్జిగ, పులిహోర తదితర ఆహారపదార్థాలను సమకూర్చారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఏటావలే ఈ ఏడాది కూడా ఒడిశా, అరకు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన సుమారు 2వేల మంది గిరిజనులతో కలిసి సింహాచలం దేవస్థానానికి చేరుకుని పూజలు చేశామని ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీష్‌బాబు తెలిపారు. శ్రీమహాదుర్గ పీఠం శ్రావణచైతన్యానందస్వామి, ట్రస్టు సభ్యులు, వెంగమాంబ భజనబృందం సభ్యులు పాల్గొన్నారు.
సంప్రదాయబద్ధంగా సంక్రాంతి సంబరాలు
రాజాం సిటీ: బొద్దాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. పాఠశాల ఆవరణను రంగవల్లులతో అలంకరించారు. డూడూ బసవన్నల విన్యాసాలు, హరిదాసుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. పిండివంటకాలను విద్యార్థులు ప్రదర్శించారు. సంక్రాంతి విశిష్టతను విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించారు.
పాదయాత్రగా అప్పన్న సన్నిధికి


