గాంధీ పేరు మార్చడం దారుణం
విజయనగరం ఫోర్ట్: ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు మార్చడం దారుణమని డీసీసీ అధ్యక్షుడు మరిపి విద్యాసాగర్ అన్నారు. ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు మార్చడాన్ని నిరసిస్తూ పట్టణంలోని ఎన్‌సీఎస్ రోడ్డులో ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఽఆదివారం నిరహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోనియా గాంధీ నాయకత్వంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో పేదబతుకుల్లో వెలుగులు నింపడానికి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతంగా ఉన్న చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతంగా మార్పు చేసి రాష్ట్ర ప్రభుత్వాలపై భారం మోపడం బాధాకరమన్నారు. గాంధీపేరు వింటేనే మోదీ, అమిత్‌షాలకు నిద్ర పట్టడంలేదన్నారు. ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా ఎత్తివేయడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సరగడం రమేష్‌కుమార్, రామచంద్రరాజు, దుర్గ ప్రసాద్, ఐశ్వర్య, ఖలీల్, శ్రీనివాస్, షరీఫ్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు విద్యాసాగర్


