ధాన్యం దళారుల పాలు..!
అన్నదాత అవస్థల పాలు.. తప్పని అష్టకష్టాలు రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న దళారులు క్వింటాకు అదనంగా 5కేజీలు తీసుకుంటున్న వైనం మద్దతు ధర కంటే తక్కువ ధర చెల్లిస్తున్న దళారులు క్వింటాకు రూ.300 వరకు నష్టపోతున్న రైతులు ఎకరాకు రూ.7 వేల నుంచి రూ.7500 వరకు నష్టపోతున్న రైతులు రైతులను దోచేస్తున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారనే విమర్శలు
●గంట్యాడ మండలం పెదవేమలి గ్రామంలో ఓ రైతు నుంచి
దళారి 61 బస్తాల ధాన్యం కొనుగోలు చేశాడు. 80 కేజీల బస్తాకుగాను 82 కేజీల 300 గ్రాముల చొప్పున తీసుకున్నాడు. అంటే
బస్తా వద్ద 2కేజీల 300 గ్రాములు అదనంగా తీసుకున్నారు.
80 కేజీల బస్తాకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం రూ.1895 చెల్లించాలి. కాని రూ.1750 మాత్రమే రైతుకు చెల్లించారు.
●విజయనగరం మండలం పినవేమలి గ్రామంలో కూడా ఓ రైతు నుంచి దళారి 20 క్వింటాళ్లు ధాన్యం కొనుగోలు చేశాడు. క్వింటాకు 100 కేజీల ధాన్యం
తీసుకోవాల్సి ఉండగా సదరు దళారి 5 కేజీలు
అదనంగా తీసుకున్నాడు. క్వింటాకు రూ.2369
చెల్లించాల్సి ఉండగా రూ.1800 మాత్రమే చెల్లించాడు.


