సాక్షి, విశాఖపట్నం : జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి 13 మంది కార్పొరేటర్ల అభ్యర్థులు విజయం సాధించారు. 6వ వార్డు నుంచి పి.హనుమంతురావు, 7వ వార్డు నుంచి పోతుల జాహ్నవి, 19వ వార్డు నుంచి మొల్లి లక్ష్మి, 42వ వార్డు నుంచి కోడిగుడ్ల పూర్ణిమ, 59వ వార్డు నుంచి అల్లు వెంకట సత్యశ్రీ, 65వ వార్డు నుంచి షేక్ జహీరున్నీషా, 76వ వార్డు నుంచి సోమాదుల సురేష్, 84వ వార్డు నుంచి గుడివాడ వెంకట సాయి అనూష, 92వ వార్డు నుంచి గొందేశి శ్రీదేవి, 94వ వార్డు నుంచి ధర్మాల రాధిక, 99వ వార్డు నుంచి కోమటి శ్రీనివాసరావు, 104వ వార్డు నుంచి మద్ది శ్రీనివాస్, 119వ వార్డు నుంచి దాసరి అన్నపూర్ణ విజయం సాధించారు. వీరందరికీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి డిక్లరేషన్ ఫారాలు అందజేశారు.


