అల్లిపురం: జీవీఎంసీ ఎన్నికల్లో 38వ వార్డు నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా మాజీ వలంటీర్ కడవల నాగమణికి వైఎస్సార్సీపీ టికెట్ కేటాయించింది. గతంలో వలంటీర్‌గా ప్రజలకు సేవలందించిన నాగమణి తన సేవా దృక్పథంతో ప్రజల మన్ననలు పొందారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్ల సేవలను పక్కనపెట్టింది. అయినప్పటికీ, గతంలో ఆమె అందించిన సేవలను గుర్తించిన వైఎస్సార్సీపీ అధిష్టానం కార్పొరేటర్‌గా పోటీ చేసే అవకాశం కల్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా నాగమణికి యువత, మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.
పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు: కార్పొరేటర్ అభ్యర్థి కడవల నాగమణి మాట్లాడుతూ, తనపై నమ్మకంతో అవకాశం కల్పించిన పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్‌కుమార్‌కు, జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజుకు, ఇతర పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేశారు. సాధారణ వలంటీర్ స్థాయి నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించడం తన బాధ్యతను మరింత పెంచిందన్నారు.


