పరిషత్‌ ఎన్నికలకు 21 నుంచి నామినేషన్లు | - | Sakshi
Sakshi News home page

పరిషత్‌ ఎన్నికలకు 21 నుంచి నామినేషన్లు

Oct 17 2026 8:18 AM | Updated on Oct 17 2026 8:18 AM

సమీక్ష నిర్వహిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ జి.విద్యాధరి

మహారాణిపేట: ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికలకు ఈ నెల 21 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ జి.విద్యాధరి తెలిపారు. నవంబర్‌ 3న పోలింగ్‌, 5న ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 203 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని, అక్కడ కనీస వసతులు కల్పించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయాలని, రాజకీయ ఫ్లెక్సీలు తొలగించి, విగ్రహాలకు ముసుగులు వేయాలని సూచించారు. ఎన్నికల సిబ్బందికి వెంటనే శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పరిషత్‌ సీఈవో నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement