బీచ్‌రోడ్డులో దాండియా జోష్‌ | - | Sakshi
Sakshi News home page

బీచ్‌రోడ్డులో దాండియా జోష్‌

Oct 17 2026 8:18 AM | Updated on Oct 17 2026 8:18 AM

ఏయూక్యాంపస్‌: దసరా పండుగను దేశవ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయంతో ఈ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. తెలుగు ప్రజలు పూజలు, అమ్మవారి ఆరాధన, భవానీ మాలలతో దసరా ఉత్సవాలను జరుపుకుంటుండగా.. కాస్మోపాలిటన్‌ నగరంగా పేరుగాంచిన విశాఖలో వివిధ రాష్ట్రాల సంస్కృతులు కలగలిసి కనిపిస్తున్నాయి.ఉత్తర భారతీయులు దసరాను ప్రత్యేక రీతిలో నిర్వహిస్తారు. ఇందులో భాగంగా బీచ్‌రోడ్డులోని కాళీమాత ఆలయం వద్ద మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం నృత్యాలతో సందడి చేశారు. అదేవిధంగా బీచ్‌రోడ్డులోని ఓ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో చిన్నారులు, యువత, వృద్ధులు ఉత్సాహంగా దాండియా ఆడారు.

సంప్రదాయ దుస్తులు ధరించి లయబద్ధమైన నృత్యాలతో ఆకట్టుకున్నారు.భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే ఈ వేడుకలు విశాఖ నగర వైవిధ్యాన్ని చాటుతున్నాయి. అన్ని ప్రాంతాల ప్రజలు కలిసి దసరాను భిన్న రూపాల్లో జరుపుకోవడం నగర ప్రత్యేకతగా నిలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement