ఉక్కునగరం: విశాఖ స్టీల్‌ప్లాంట్ సీఎండీ ఎం.ఎన్.వి.ఎస్. ప్రభాకర్‌కు స్టీల్‌ప్లాంట్ అనుబంధ సంస్థలైన ఈస్ట్రన్ ఇన్‌వెస్ట్‌మెంట్ లిమిటెడ్ (ఈఐఎల్), బిస్రా స్టోన్ లైమ్ కంపెనీ లిమిటెడ్ (బీఎస్‌ఎల్‌సీ) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వహించిన డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) ఎ.కె.బాగ్చీ సోమవారం పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో సీఎండీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ ఉప కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.


