నీలి సంద్రం.. గాల్లో విహారం | - | Sakshi
Sakshi News home page

నీలి సంద్రం.. గాల్లో విహారం

May 15 2026 12:31 PM | Updated on May 15 2026 12:31 PM

ప్రముఖ పర్యాటక ప్రాంతమైన రుషికొండ బీచ్‌ ప్రస్తుతం సాహస క్రీడలకు నెలవుగా మారింది. ఇక్కడ కొత్తగా అందుబాటులోకి వచ్చిన పారాగ్లైడింగ్‌ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నీలిరంగు సముద్రపు అలలపై గాలిలో తేలుతూ, విహంగ వీక్షణంగా తీర ప్రాంత అందాలను ఆస్వాదించడం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇస్తోంది. నిపుణులైన పైలట్ల పర్యవేక్షణలో సాగుతున్న ఈ పారాగ్లైడింగ్‌, అటు స్థానికులను ఇటు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఆకాశం నుంచి సాగర తీరాన్ని చూస్తూ ప్రకృతి ఒడిలో విహరిస్తున్న పర్యాటకులు ఈ అనుభవాన్ని మరుపురాని జ్ఞాపకంగా అభివర్ణిస్తున్నారు. –ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్‌, విశాఖపట్నం

Advertisement
 
Advertisement
Advertisement