భవనంపై నుంచి పడి తాపీ మేసీ్త్ర మృతి | - | Sakshi
Sakshi News home page

భవనంపై నుంచి పడి తాపీ మేసీ్త్ర మృతి

May 15 2026 12:31 PM | Updated on May 15 2026 12:31 PM

పీఎం పాలెం: భవన నిర్మాణ పనుల కోసం నగరానికి వచ్చిన ఓ తాపీ మేసీ్త్ర ప్రమాదవశాత్తు పై అంతస్తు నుంచి కింద పడి మృతి చెందిన విషాద ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పీఎం పాలెం సీఐ జి. బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకూర్మానికి చెందిన ఉంకుల రాము (47) క్రికెట్‌ స్టేడియం సమీపంలోని ఒక నిర్మాణంలో ఉన్న భవనంలో తాపీ మేసీ్త్రగా పనిచేస్తున్నాడు. పగలు పని ముగించుకుని రాత్రి అదే భవనం నాలుగో అంతస్తులో తోటి కార్మికులతో కలిసి నిద్రించాడు. తెల్లవారుజామున రాము కనిపించకపోవడంతో తోటి వారు వెతకగా, భవనం ప్రహరీ అవతల శవమై కనిపించాడు. రాత్రి సమయంలో నిద్రమత్తులో భవనం అంచుకు వెళ్లినప్పుడు రక్షణ గోడ లేకపోవడంతో ప్రమాదవశాత్తు కింద పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతునికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. కుమారుడు యుగంధర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement