మద్దిలపాలెం: ఏపీపీజీఈసెట్–2026 ఫలితాలలో నగరానికి చెందిన సీపాన అలేఖ్య రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించింది. గురువారం విడుదలైన ఈ ఫలితాల సందర్భంగా ఆమె మాట్లాడుతూ గీతం వర్సిటీలో బీటెక్ బయోటెక్నాలజీ పూర్తి చేశానని, ఏయూలో ఎంటెక్ చేరాలనే లక్ష్యంతో ప్రిపేర్ అయ్యానని తెలిపింది. రోజుకు 4 గంటల పాటు శ్రమించి ఈ ఘనత సాధించినట్లు ఆమె పేర్కొన్నారు. భవిష్యత్తులో మెడికల్ బయోటెక్నాలజీ రంగంలో పరిశోధనలు చేసి, కొత్త ఆవిష్కరణల్లో భాగస్వామి కావడమే తన ధ్యేయమని అలేఖ్య వెల్లడించారు.


