మురికి కూపాల్లోనూ ఆత్మవిశ్వాసం వెతుక్కునే ఒక శ్రమజీవి కథ ఇది. ప్రజలు పనికిరావని పారేసిన ప్లాస్టిక్ వ్యర్థాలే ఈయనకు జీవనాధారం. ఆ భుజాన ఉన్న మూటలో కేవలం ప్లాస్టిక్ సీసాలు మాత్రమే లేవు, రేపటి పూట ఆకలి తీరుతుందన్న ఆశలు కూడా ఉన్నాయి. నెత్తిన మోస్తున్న బరువు శరీరాన్ని కుంగదీస్తున్నా, ఆయన ముఖంలోని ఆ చిరునవ్వు పేదరికాన్ని గెలిచిన ధీరత్వాన్ని చాటుతోంది. నగర వీధులను శుభ్రం చేస్తూ, పర్యావరణానికి మేలు చేస్తున్న ఈ అదృశ్య యోధుడికి తన శ్రమ తప్ప మరే పెట్టుబడీ లేదు. ఆ మూటలో మోస్తున్నది చెత్తను కాదు, తన కుటుంబ భవిష్యత్తును.
–ఫొటో : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం


