భారతీయ ఆభరణ కళా వేదిక ‘ద ఇండియా ఎడిట్‌’ | - | Sakshi
Sakshi News home page

భారతీయ ఆభరణ కళా వేదిక ‘ద ఇండియా ఎడిట్‌’

May 15 2026 10:02 AM | Updated on May 15 2026 10:02 AM

ఏయూ క్యాంపస్‌: భారతీయ ఆభరణ కళ అద్భుత వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా వైభవ్‌ జ్యూయలర్స్‌ ఆధ్వర్యంలో ఆభరణాల ప్రదర్శన, అమ్మకాల వేదిక ‘ద ఇండియా ఎడిట్‌’ బీచ్‌రోడ్డులోని గ్రాండ్‌ బే హోటల్‌లో బుధవారం ప్రారంభమైంది. విశిష్ట అతిథులు డా.సుయాన్‌ చాపన్‌(ఐఎఫ్‌ఎస్‌), కంచెర్ల రాంప్రసాద్‌, భారత్‌ మల్లిక రత్నకుమారి గ్రంధి(సీఎండీ) జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రతి ప్రాంత విశిష్టత నుంచి ప్రేరణ పొందిన నాలుగు సిగ్నేచర్‌ కలెక్షన్లను ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. వైభవ్‌ సంస్థ చైర్‌పర్సన్‌ గ్రంధి మల్లికా మనోజ్‌ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల ఆభరణాల సాంప్రదాయా న్ని చాటిచెప్పే అసాధారణ ప్రదర్శనగా దీన్ని పేర్కొన్నారు. భారతీయ ఆభరణ కళకు చెందిన అద్భుత వైవిధ్యాన్ని ఈ ప్రదర్శనలో ఆవిష్కరించామన్నారు. ఈ ప్రదర్శన 14, 15 తేదీల్లో ఉదయం 10 నుంచి రాత్రి 9 వరకు కొనసాగుతుందని వెల్లడించారు. ప్రదర్శనలో దేశవ్యాప్తంగా ఉన్న కళాకారుల అద్భుత హస్త కళా నైపుణ్యాన్ని పరిచయంచేసే ‘జ్యూయలరీ మ్యాప్‌ అఫ్‌ ఇండియా‘ను ఆవిష్కరించారు.

Advertisement
 
Advertisement
Advertisement