సీబీఎస్‌ఈ ప్లస్‌2లో శ్రీ చైతన్య జోరు | - | Sakshi
Sakshi News home page

సీబీఎస్‌ఈ ప్లస్‌2లో శ్రీ చైతన్య జోరు

May 15 2026 9:56 AM | Updated on May 15 2026 9:56 AM

మద్దిలపాలెం: సీబీఎస్‌ఈ ప్లస్‌ 2 ఫలితాల్లో నగరంలోని శ్రీచైతన్య విద్యాసంస్థలు జాతీయ స్థాయిలో తమ అధిక్యతను చాటుకున్నాయి. విశాఖ నుంచి అత్యధికంగా ఎస్‌కే ముక్తర్‌మదీనా 485, ఆలీ అగ్బార్‌ 484, బి.జోష్న 482, పి.భార్గవ్‌ నాయుడు 481, కె.గణేంద్ర 480 మార్కులతో సత్తా చాటారని సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఏజీఎం కేవీ రమణ, డీన్లు ఎన్‌.రఘుకుమార్‌, కె.బంగారుబాబులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 480 ఆపై 5 గురు, 470కి పైగా 10 మంది, 450కి పైగా 52 మంది విద్యార్థులు మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు. 530 మంది విద్యార్థులు డిస్టింక్షన్‌ సాధించడం తమకు గర్వకారణమన్నారు. ఈ మేరకు విద్యార్థులకు, శిక్షణ అందించిన అధ్యాపకులకు, సిబ్బందికి, తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement