పలు రైళ్ల గమ్యం కుదింపు | - | Sakshi
Sakshi News home page

పలు రైళ్ల గమ్యం కుదింపు

May 15 2026 9:56 AM | Updated on May 15 2026 9:56 AM

తాటిచెట్లపాలెం: పలు రైల్వేస్టేషన్లలో జరుగుతున్న ఆధునికీకరణ పనుల నేపథ్యంలో ఆయా తేదీల్లో బయల్దేరే పలు రైళ్ల గమ్యం కుదిస్తున్నట్లు వాల్తేర్‌ డివిజన్‌ రైల్వే అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

● ఈ నెల 15, 16, 18, 19, 20, 22, 23, 25, 26, 27, 29, 30వ తేదీల్లో తిరుపతిలో బయల్దేరే తిరుపతి–పూరి(17480) ఎక్స్‌ప్రెస్‌ మాలతిపత్‌పూర్‌ వరకు మాత్రమే నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 17, 18, 20, 21, 22, 24, 25, 27, 28, 29, 31 తేదీల్లో పూరిలో బయల్దేరాల్సిన పూరి–తిరుపతి(17479) ఎక్స్‌ప్రెస్‌ పూరి నుంచి కాకుండా మాలతిపత్‌పూర్‌ నుండి బయల్దేరుతుంది. ఈ తేదీల్లో మాలతిపత్‌పూర్‌–పూరి మధ్య ఈ రైలు రాకపోకలు సాగించదు.

● జూన్‌ 7 నుంచి 18 వరకు విశాఖలో బయల్దేరే విశాఖపట్నం–కోర్బా(18518) ఎక్స్‌ప్రెస్‌ బిలాస్‌పూర్‌ వరకు మాత్రమే నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో జూన్‌ 8 నుంచి 19 వరకు కోర్బాలో బయల్దేరాల్సిన కోర్బా–విశాఖపట్నం(18517) ఎక్స్‌ప్రెస్‌ కోర్బా నుంచి కాకుండా బిలాస్‌పూర్‌ నుండి బయల్దేరుతుంది. ఈ తేదీల్లో బిలాస్‌పూర్‌–కోర్బా మధ్య ఈ రైలు రాకపోకలు సాగించదు.

● ఈ నెల 18న విశాఖపట్నం–పలాస–విశాఖపట్నం(67289/67290) మెము పాసింజర్‌ శ్రీకాకుళం రోడ్‌ వరకు మాత్రమే నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం రోడ్‌ నుంచి విశాఖ చేరుకుంటుంది. ఈ తేదీలో శ్రీకాకుళం రోడ్‌–పలాస మధ్య ఈ రైలు రాకపోకలు సాగించదు.

Advertisement
 
Advertisement
Advertisement