ఉక్కునగరం: విశాఖ స్టీల్‌ప్లాంట్ డైరెక్టర్ (ఆపరేషన్స్)గా సెయిల్‌లోని దుర్గాపూర్ స్టీల్‌ప్లాంట్‌కు చెందిన చీఫ్ జనరల్ మేనేజర్స్ (ప్రాజెక్ట్స్) సుభాషిస్ సేన్‌గుప్తా నియమితులయ్యారు. ప్రస్తుత డైరెక్టర్ (ఆపరేషన్స్) సలీం జి పురుషోత్తమన్ మే నెలాఖరున పదవీ విరమణ చేయనుండటంతో ఆ పోస్టుకు మంగళవారం పీఈఎస్‌బీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి ఎనిమిది మంది, సెయిల్, ఎన్టీపీసీ, ఎన్‌ఎండీసీ, సీసీఐ నుంచి ఒక్కొక్కరు చొప్పున 12 మంది హాజరయ్యారు. అందులో సుభాషిస్ సేన్‌గుప్తాను ఎంపిక చేసినట్టు పీఈఎస్‌బీ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఆయన జూన్ 1న బాధ్యతలు చేపట్టనున్నారు.


