పోటీ పరీక్షల అవగాహన సదస్సుకు విశేష స్పందన
తగరపువలస: స్థానిక రాజుల తాళ్లవలసలో గల తిరుమల ఐఐటీ, మెడికల్ అకాడమీలో జేఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్, నీట్ పరీక్షలపై ఆదివారం నిర్వహించిన అవగాహన సదస్సుకు భారీ ఎత్తున స్పందన లభించింది. సుమారు 8 వేల మంది సదస్సుకు హాజరయ్యారని కళాశాల రెసిడెంట్ డైరెక్టర్లు ఇ. మృత్యుంజయరావు, కె. సత్యనారాయణ తెలిపారు. 6,7,8,9,10, ఇంటర్ విద్యార్థులకు ఈ పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో వివరించినట్లు తెలిపారు. పిల్లలు క్రమశిక్షణతో ఎలా మెలగాలి, వారి ప్రగతికి తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి అనే విషయాలు వివరించారు. పిల్లల్లో చదువుకు సంబంధించిన అడ్డంకులు, వారికి ఎదురయ్యే సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో వివరంగా తెలిపారు.


