గుర్తుతెలియని యువకుడి మృతి
గోపాలపట్నం: మర్రిపాలెం రైల్వే యార్డు సమీపంలో ఓ గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. ఎయిర్‌పోర్టు పోలీసులు తెలిపిన వివరాలివి.. యార్డు ఆవరణలోని ఒక చెట్టు కింద సుమారు 24 నుంచి 30 ఏళ్ల వయసు కలిగిన యువకుడు మృతి చెంది ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. అతని ఒంటిపై నలుపు రంగు ప్యాంట్, డార్క్ బ్లూ టీషర్ట్ ఉన్నాయి. సంఘటనా స్థలంలో మృతుడికి సంబంధించిన ఒక బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బ్యాగులో ప్లాస్టిక్ రాధాకృష్ణ బొమ్మతో పాటు, కొన్ని రకాల మందులు ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతనికి సంబంధించిన వివరాలు ఎవరికై నా తెలిస్తే 94409 04350, 83310 41638 నంబర్లలో తెలియజేయాలని ఎయిర్‌పోర్టు సీఐ శంకరనారాయణ కోరారు.


