అప్పన్న సన్నిధిలో సినీ ప్రముఖులు
సింహాచలం : సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఆదివారం సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్, నటుడు ఆది సాయికుమార్, దర్శకుడు ఓంకార్, నటుడు అశ్విన్ బాబు స్వామివారిని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని, బేడా మండపంలో ప్రదక్షిణలు చేశారు. అంతరాలయంలో వీరికి అర్చకులు స్వామివారి దివ్య ఆశీస్సులు అందించి, ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేశారు.


