క్రేజీ కై ట్స్
శంకరమఠం రోడ్‌లో గాలిపటాలు విక్రయాలు
కనుజు పిల్లతో తల్లి
సీతంపేట: సంక్రాంతి అంటేనే సందడి. ఇంటి ముందు రంగవల్లులు, ఆకాశంలో రంగు రంగుల పతంగులు. ఈ పండగ వచ్చిందంటే చాలు పిల్లల నుంచి పెద్దల వరకు అందరిలోనూ కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది. పిండివంటల ఘుమఘుమలు, హరిదాసుల కీర్తనలు, బసవన్నల దీవెనలతో పాటు, ఆకాశంలో ఎగిరే గాలిపటాలు పండగకు కొత్త శోభను తీసుకువస్తాయి.
భలే భలే పతంగులు
శంకరమఠం రోడ్, పాలబూత్ సెంటర్, సంగం ఆఫీస్ కూడలి ప్రాంతాలు గాలిపటాల విక్రయాలతో కళకళలాడుతున్నాయి. చిన్నారుల అభిరుచికి తగ్గట్టుగా వ్యాపారులు పేపర్, పాలిథిన్, క్లాత్‌తో చేసిన వైరెటీ గాలిపటాలను సిద్ధం చేశారు. బాహుబలి, స్పైడర్‌మ్యాన్, డోరేమాన్, టామ్ అండ్ జెర్రీ, చోటాభీమ్ వంటి కార్టూన్, సినిమా తారల చిత్రాలతో కూడిన పాలిథిన్, పేపర్ గాలిపటాలు పిల్లలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. క్లాత్‌తో తయారు చేసిన సీతాకోకచిలుక, షార్క్ చేప, పులి, సింహం, రామచిలుక, గబ్బిలం, గ్రద్ద ఆకారపు గాలిపటాలకు మంచి డిమాండ్ ఉంది. సామాన్యుడికి అందుబాటులో ఉండేలా రూ.10 నుంచి మొదలుకొని రూ.1,000 వరకు వివిధ రకాల గాలిపటాలు లభిస్తున్నాయి. షాపింగ్ మాల్స్ అలంకరణ కోసం ప్రత్యేకంగా చిన్న సైజు పతంగుల ప్యాకెట్ల(100 పీసులు)ను రూ.600లకు విక్రయిస్తున్నారు.
చైనా మాంజాపై నిషేధం
గాలిపటాలు ఎగరేయడం ఎంత సరదాగా ఉంటుందో, అందులో వాడే దారం విషయంలో అంతే జాగ్రత్త అవసరం. చైనా మాంజా(గాజు పొడి పూసిన దారం) వినియోగం వల్ల గతంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించింది. ఇది పక్షులకు, మనుషులకు అత్యంత ప్రమాదకరం. ఈ నేపథ్యంలో పోలీసులు చైనా మాంజా విక్రయాలు, వినియోగంపై కఠిన నిషేధం విధించారు. ప్రజలు భద్రతా దృష్ట్యా చైనా మాంజాను వాడకూడదని, పాత స్టాక్ ఉన్నా ఉపయోగించవద్దని సూచించారు. దీనికి ప్రత్యామ్నాయంగా సురక్షితమైన స్థానిక దారం(కాటన్ మాంజా) రీల్స్ మాత్రమే వాడాలని కోరుతున్నారు. మార్కెట్‌లో సాధారణ మాంజా రూ.50 నుంచి రూ.300 వరకు లభిస్తోంది.
ఈమూ పిల్లలు
మార్కెట్‌లో
వైరెటీ గాలిపటాలు
బాహుబలి నుంచి
చోటాభీమ్ దాకా..
క్రేజీ కై ట్స్
క్రేజీ కై ట్స్
క్రేజీ కై ట్స్
క్రేజీ కై ట్స్
క్రేజీ కై ట్స్
క్రేజీ కై ట్స్
క్రేజీ కై ట్స్
క్రేజీ కై ట్స్
క్రేజీ కై ట్స్
క్రేజీ కై ట్స్


