నా బంగారు కూన..
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్క్ కొత్త ప్రాణుల రాకతో కళకళలాడుతోంది. జూలో అమలు చేస్తున్న పునరుత్పత్తి చర్యలు, ఇతర రాష్ట్రాల నుంచి జంతు మార్పిడి విధానం సత్ఫలితాలనిస్తున్నాయి. దీని వల్ల వన్యప్రాణుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన నెల రోజుల వ్యవధిలోనే జూలో ఏకంగా ఐదు రకాల వన్యప్రాణులు పండంటి పిల్లలకు జన్మనిచ్చాయి. ఇందులో ఆరు ఈమూ పిల్లలు, మూడు కృష్ణ జింకలు, రెండు కనుజులు, రెండు నీలగాయిలు, ఒక నల్ల హంస పిల్ల ఉన్నాయి. ఈ చిన్నారుల రాకతో జూలో సందడి నెలకొంది. ప్రస్తుతం పుట్టిన పిల్లలన్నీ ఆరోగ్యంగా ఉన్నాయని, వెటర్నరీ వైద్య బృందం, జంతు సంరక్షకులు వీటిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని జూ క్యూరేటర్ జి.మంగమ్మ తెలిపారు.


