పలు రైళ్లు రీ షెడ్యూల్‌ | - | Sakshi
Sakshi News home page

పలు రైళ్లు రీ షెడ్యూల్‌

Published Sun, Jan 28 2024 2:14 AM | Last Updated on Sun, Jan 28 2024 9:28 AM

- - Sakshi

తాటిచెట్లపాలెం: ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే, ఖుర్దారోడ్‌ డివిజన్‌, ఖుర్దారోడ్‌–బ్రహ్మపూర్‌ సెక్షన్‌ పరిధిలో జరుగుతున్న లిమిటెడ్‌ హైట్‌ సబ్‌వే పనుల నిమిత్తం ట్రాఫిక్‌ బ్లాక్‌ తీసుకుంటున్నందున ఈ మార్గంలో నడిచే పలు రైళ్లు ఆయా తేదీల్లో రీ షెడ్యూల్‌ చేస్తున్నట్లు వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు.

► ఫిబ్రవరి 1వ తేదీన భువనేశ్వర్‌లో మధ్యాహ్నం 12.10 గంటలకు బయల్దేరాల్సిన భువనేశ్వర్‌–ఎంజీఆర్‌ చైన్నె సెంట్రల్‌(12830) సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ 3 గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 3.10 గంటలకు బయల్దేరుతుంది.

► ఫిబ్రవరి 1వ తేదీన పూరీలో మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరాల్సిన పూరీ–గుణుపూర్‌(18417) ఎక్స్‌ప్రెస్‌ మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరుతుంది.

► ఫిబ్రవరి 1వ తేదీన గుణుపూర్‌లో ఉదయం 5 గంటలకు బయల్దేరాల్సిన గుణుపూర్‌–పూరీ(18418) ఎక్స్‌ప్రెస్‌ ఉదయం 9గంటలకు బయల్దేరుతుంది.

► ఈనెల 31న తిరుపతిలో ఉదయం 10.40 గంటలకు బయల్దేరాల్సిన తిరుపతి–పూరీ(17480) ఎక్స్‌ప్రెస్‌ మధ్యాహ్నం 2.40 గంటలకు బయల్దేరుతుంది.

► ఫిబ్రవరి 1న సంత్రాగచ్చిలో ఉదయం 5 గంటలకు బయల్దేరాల్సిన సంత్రగచ్చి–తాంబరం (06054) స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉదయం 7 గంటలకు బయల్దేరుతుంది.

► ఈ నెల 31న ఎంజీఆర్‌ చైన్నె సెంట్రల్‌లో రాత్రి 7.50 గంటలకు బయల్దేరాల్సిన ఎంజీఆర్‌ చైన్నె సెంట్రల్‌–షాలిమర్‌(22826) సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రాత్రి 10.10గంటలకు బయల్దేరుతుంది.

► ఈ నెల 31న తిరునల్వేలిలో తెల్లవారు 3 గంటలకు బయల్దేరాల్సిన తిరునల్వేలి– పురూలియా (22606) సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉదయం 7.15 గంటలకు బయల్దేరుతుంది.

► ఈ నెల 31న పుదుచ్చేరిలో మధ్యాహ్నం 2.15 గంటలకు బయల్దేరాల్సిన పుదుచ్చేరి–హౌరా(12868) సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ సాయంత్రం 5గంటలకు బయల్దేరుతుంది.

► ఈ నెల 31న చైన్నె సెంట్రల్‌లో రాత్రి 7 గంటలకు బయల్దేరాల్సిన ఎంజీఆర్‌ చైన్నె సెంట్రల్‌– హౌరా(12840) సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రాత్రి 9.30 గంటలకు బయల్దేరుతుంది.

► ఈ నెల 31న సికింద్రాబాద్‌లో సాయంత్రం 4.50 గంటలకు బయల్దేరాల్సిన సికింద్రాబాద్‌–హౌరా(17016) విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రాత్రి 7.35గంటలకు బయల్దేరుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement