తాళం వేయడంపై ఆగ్రహం
1902 నుంచి ఉపయోగిస్తున్న ఈ భవనానికి కార్పొరేటర్ కోడూరు అప్పలరత్నం తాళం వేసి జీవీఎంసీ జోనల్ కమిషనర్‌కు అప్పగించారు. ఈ బంగ్లా వివాదంపై 2017 నుంచి హైకోర్టులో కేసు ఉంది. ఈ స్థలంపై తమకు సంబంధం లేదని జీవీఎంసీ అప్పట్లోనే హైకోర్టుకు రాతపూర్వకంగా సమర్పించింది. ప్రస్తుతం కేసు పెండింగ్‌లో ఉంది. ఇంతలో కార్పొరేటర్ బంగ్లాకు తాళం వేయడం సరికాదు. ఇలాంటి చర్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తాయి. అన్ని సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ బంగ్లాకు సంబంధించి కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది. నిబంధనలు విరుద్ధంగా బంగ్లాకు తాళం వేసిన కార్పొరేటర్‌పై చర్యలు తీసుకోవాలి. తక్షణమే బంగ్లాను తెరిపించాలని, లేనిపక్షంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తాం. –పూడిపెద్ది శర్మ, విశ్వహిందూ పరిషత్ మహానగర్ నేత, విశాఖ


