సింహ గిరి
సంబరాల
సింహాచలం: సింహగిరిపై బుధవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి పండగ విశిష్టతను చాటుతూ, గ్రామీణ జీవన విధానాన్ని ప్రతిబింబించే విధంగా దేవస్థానం అధికారులు ఈ సంబరాలను నిర్వహించారు. భోగి పర్వదినాన స్వామివారిని దర్శించుకునేందుకు సింహగిరికి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు సంక్రాంతి సంబరాలను కూడా తనివితీరా తిలకించారు. ఉదయం ఆలయ రాజగోపురం ఎదురుగా ఉన్న మాడ వీధిలో పెద్ద ఎత్తున వేసిన భోగిమంటను దేవస్థానం ఇన్‌చార్జి ఈవో ఎన్.సుజాత వెలిగించి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. అనంతరం భక్తులు పిడకలను భోగిమంటలో వేశారు. దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఏఈవో తిరుమలేశ్వరరావు, 98వ వార్డు కార్పొరేటర్ పి.వి.నరసింహం తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ప్రదర్శనలు
సంక్రాంతి సంబరాల్లో భాగంగా మాడ వీధిల్లో ఏర్పాటుచేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గొబ్బెళ్ల ముత్యాల ముగ్గులు, చెరుకు గెడల జాలువలు, ఎడ్లబండి, నాగళ్లు, పూరిగుడెసెలు, గడ్డిమోపులు, రంగులు వేసిన కుండలు, గోవులు, ఎద్దులబండి, ట్రాక్టర్‌ను భక్తులు తిలకించారు. జంగం దేవెర, కొమ్మదాసరి, హరిదాసులు సంక్రాతి సంబరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గంగిరెడ్ల విన్యాసాలు, కోలాటం ప్రదర్శనలను భక్తులను ఆకట్టుకున్నాయి. ధాన్యం గుట్టలవద్ద మహిళలు సందడి చేశారు. కుండల్లో పాలు పోసి పొంగించారు. కుమ్మరి తయారుచేసే మట్టి వస్తువులను ఆసక్తిగా తిలకించారు. బొమ్మలకొలువు ఆకట్టుకుంది.
ధాన్యం గుట్టల వద్ద సందడి చేస్తున్న యువతులు
సింహగిరిపై భోగిమంట వెలిగిస్తున్న ఈవో సుజాత, వైదికులు
భోగి మంటల వద్ద నగర ప్రజలు
ఎద్దులబండి వద్ద చిన్నారులు, భక్తుల సందడి
లక్ష ఆవు పేడపిడకలతో ఏర్పాటు చేసిన భోగి మంట
కుండలో పాలుపొంగిస్తున్న యువతులు
సింహ గిరి
సింహ గిరి
సింహ గిరి
సింహ గిరి


