విశాఖ: సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఎగురేసే గాలిపటాల కారణంగా మాంజా(అత్యంత పదునుగా ఉండే దారం) దడపుట్టిస్తోంది. ఈ మాంజా బారిన పడి అనేక మంది గాయాల బారిన పడుతున్నారు. తాజాగా విశాఖలో మాంజా కారణంగా ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఉదంతం వెలుగుచూసింది.
మాజీ సైనిక ఉద్యోగి నోటిని మాంజా కోసేసింది. మాంజా దారం తగిలి వెంకట్రావు అనే మాజీ సైనికోద్యోగి గాయపడ్డారు. రెండు పెదవుల మధ్య తీవ్ర గాయమైంది. దాంతో తీవ్ర రక్త స్రావంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. నోటికి రుండు వైపులా కుట్ల వేసేంతంగా గాయమైంది. మధురవాడలో బైక్ పై కొడుకుతో కలిసి ప్రయాణిస్తుండగా ఇది చోటు చేసుకుంది.
తెలంగాణలో ఘటనలు
జనవరి 13 వ తేదీన ఓ పోలీసు అధికారి విధుల్లో భాగంగా బైక్‌పై వెళ్తుండగా మెడకు చైనీస్ మాంజా తగిలి తీవ్ర గాయపడ్డాడు. రక్తస్రావం ఎక్కువగా జరిగి ఆసుపత్రికి తరలించారు.
నిజామాబాద్: ఒక రైతు గాలిపటాల దారంలో చిక్కుకుని తీవ్ర గాయపడ్డాడు.
మాంజా వల్ల జరుగుతున్న గాయాలు, మరణాలపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్‌గా స్పందించింది. ఫిబ్రవరి 26లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని పోలీస్ విభాగానికి ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఘటనలు
సంక్రాంతి సీజన్‌లో: చైనీస్ మాంజా కారణంగా పదుల సంఖ్యలో గాయాలు నమోదయ్యాయి.
పోలీసుల చర్యలు: "సీజ్ ది కైట్" ఆపరేషన్‌లో మాంజా విక్రయాలు, వినియోగంపై కేసులు నమోదు చేశారు. కానీ అమలు కఠినంగా జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి.
ప్రమాదాల తీవ్రత
గాజు పొడి, లోహపు పదార్థాలు కలిపి తయారు చేస్తారు. ఇవి చర్మాన్ని, గొంతును కోసేంత పదునుగా ఉంటాయి.
ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు, వందలాది మంది గాయపడ్డారు.
నిషేధం ఉన్నప్పటికీ: మార్కెట్లో మాంజా సులభంగా లభిస్తోంది. పోలీసులు అరెస్టులు చేసినా, వినియోగం తగ్గడం లేదు


