తాటిచెట్లపాలెం: విజయవాడ డివిజన్ పరిధిలో జరుగుతున్న భద్రతాపరమైన పనుల కారణంగా ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు సీనియర్ డీసీఎం ఎ.కె. త్రిపాఠి తెలిపారు. 13న హతియా–ఎర్నాకుళం(22837) సూపర్‌ఫాస్ట్, 14న హతియా–ఎస్‌ఎంవీ బెంగళూరు(12835) సూపర్‌ఫాస్ట్, 15న జసిద్ది–తాంబరం(12376) సూపర్‌ఫాస్ట్, 16న టాటా–యశ్వంత్‌పూర్(18111) ఎక్స్‌ప్రెస్, 17న టాటా–ఎస్‌ఎంవీ బెంగళూరు(12889) సూపర్‌ఫాస్ట్, 13 నుంచి 17వ తేదీ వరకు ధన్‌బాద్–అలెప్పీ(13351) బొకారో ఎక్స్‌ప్రెస్, ఈ నెల 23, 25, 27, 28వ తేదీల్లో ముంబయి–భువనేశ్వర్ (11019) కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లు విజయవాడ–ఏలూరు–నిడదవోలు మీదుగా కాకుండా వయా విజయవాడ–గుడివాడ–భీమవరం టౌన్–నిడదవోలు మీదుగా ప్రయాణిస్తాయి. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని ఆయన కోరారు.