సొసైటీల విభజనకు శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

సొసైటీల విభజనకు శ్రీకారం

Nov 29 2026 11:53 AM | Updated on Nov 29 2026 11:53 AM

బషీరాబాద్‌: రైతులకు సహకార సేవలను మరింత చేరువ చేసేందుకు నావంద్గీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం విభజన ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం 31 గ్రామాలతో కొనసాగుతున్న ఈ సంఘం నుంచి 16 గ్రామాలను వేరుచేసి కాశీంపూర్‌ కేంద్రంగా కొత్త సొసైటీ ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. దీంతో నావంద్గీ సంఘం పరిధిలో 15 గ్రామాలే మిగలనున్నాయి. ఈ ప్రతిపాదనపై అభ్యంతరాలు, సూచనలు స్వీకరించేందుకు జిల్లా సహకార సంఘం అధికారులు డిసెంబరు 18 వరకు గడువు ఇచ్చారు.

గ్రామాల విభజన ఇలా..

కొత్తగా ఏర్పడిన కాశీంపూర్‌ సొసైటీకి పర్వతపల్లి, మర్పల్లి, ఇస్మాయిల్‌పూర్‌, నీళ్లపల్లి, జలాల్‌పూర్‌, మంతట్టి, కంసాన్‌పల్లి మక్తా, రెడ్డిఘనాపూర్‌, నవల్గా, గొట్టిగఖుర్దు, గొట్టిగ కలాన్‌, మల్కాన్‌గిరి, మంథ్లాపూర్‌, బాద్లాపూర్‌, కుప్పన్‌కోట్‌ గ్రామాలు కొత్త సంఘం పరిధిలోకి రానున్నాయి.

అలాగే నావంద్గీకి 15 గ్రామాలను కేటాయించారు. ఇందులో క్యాద్గిరా, గంగ్వార్‌, ఇందర్‌చెడ్‌, మంథన్‌గౌడ్‌, అల్లాపూర్‌, ఎక్మాయి, దామార్‌చెడ్‌, కంసాన్‌పల్లి(బి), కొత్లాపూర్‌, కొర్విచెడ్‌, షాపూర్‌, మాసన్‌పల్లి, జీవన్గీ, మైల్వార్‌ గ్రామాలు పాత సంఘం పరిధిలో కొనసాగనున్నాయి.

18వ తేదీ వరకు అభ్యంతరాలు

తెలంగాణ సహకార సంఘాల చట్టం– 1964లోని సెక్షన్‌ 15– ఏ ప్రకారం అధికారులు ఈ ప్రక్రియ చేపట్టారు. సభ్యులు, డిపాజిట్‌దారులు, రుణదాతలు, ఉద్యోగులు, ఇతర సంబంధిత వ్యక్తులు తమ అభ్యంతరాలు, సూచనలను కారణాలు, ఆధార పత్రాల నకళ్లతో డిసెంబరు 18వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా జిల్లా సహకార అధికారి కార్యాలయానికి నేరుగా లేదా రిజిస్టర్డ్‌ పోస్టు ద్వారా పంపాలి.

ఏడు రోజుల్లో సాధారణ సభ

ప్రకటన వెలువడిన ఏడు రోజుల్లోగా సాధారణ సభ నిర్వహించి, విభజన ప్రతిపాదనపై చర్చించి తీర్మాన ప్రతిని అధికారులకు పంపాలని ఆదేశించారు. అభ్యంతరాలు రాకపోతే తదుపరి చర్యలు చేపట్టనున్నారు. సంబంధిత గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ప్రకటనను ప్రదర్శించాలని సూచించారు.

కాశీంపూర్‌ కేంద్రంగా

కొత్త సంఘం ఏర్పాటు

నూతన సొసైటీకి

16 గ్రామాల కేటాయింపు

నావంద్గీ సంఘం పరిధిలో 15 గ్రామాలే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement