కళాశాలలో ‘ఎస్‌సమ్మిట్‌–2026’ సదస్సు | - | Sakshi
Sakshi News home page

కళాశాలలో ‘ఎస్‌సమ్మిట్‌–2026’ సదస్సు

Nov 29 2026 11:53 AM | Updated on Nov 29 2026 11:53 AM

మొయినాబాద్‌: మున్సిపాలిటీలోని చిలుకూరు రెవెన్యూలో ఉన్న కేజీరెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో శనివారం ‘ఎస్‌సమ్మిట్‌–2026’ రాష్ట్రస్థాయి యువ పారిశ్రామికవేత్తల సదస్సును ఘనంగా నిర్వహించారు. సెంటర్‌ ఫర్‌ యూత్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఆక్టివిటీస్‌(సీవైడీఏ), తెలంగాణ గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌(టీజీఐసీ), యూత్‌ ఐడ్‌ ఎంట్రెప్రేనెర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(వైఈఎఫ్‌ఐ) సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సులో రాష్ట్రంలోని పలువురు యువ పారిశ్రామికవేత్తలు తమ వినూత్న వ్యాపార ఆలోచనలను ప్రదర్శించారు. వ్యవసాయం, సాంకేతికత, ఆహార శుద్ధి, ప్యాషన్‌, పర్యాటకం, పర్యావరణహిత వ్యాపారాలు, సామాజిక ఆవిష్కరణలు తదితర రంగాలకు సంబంధించి 40కి పైగా వ్యాపార ఆలోచనలను ప్రదర్శించారు. పరిశ్రమల నిపుణులు, యువతతో ముఖాముఖీ చర్చలు జరిపి స్టార్టప్‌ల అభివృద్ధి, వ్యాపార అవకాశాలపై అవగాహన కల్పించారు. 14 మంది జ్యూరీ సభ్యులు ఆవిష్కరణ, వ్యాపార సాధ్యాసాధ్యాలు, సామర్థ్యం, సామాజిక ప్రభావం వంటి అంశాలను పరిశీలించి ఆరు విజేత బృందాలను ఎంపిక చేశారు. విజేతలకు తమ వ్యాపార ఆలోచనలను మరింత అభివృద్ధి చేసుకునేందుకు నిపుణుల మార్గదర్శకత్వం, మెంటరింగ్‌ అందించనున్నారు. ప్రతిభ కనబరిచిన స్టార్టప్‌లను 2027 మార్చిలో న్యూఢిల్లీలో నిర్వహించనున్న జాతీయస్థాయి ఎస్‌సమ్మిట్‌కు నామినేట్‌ చేశారు. కార్యక్రమంలో సీవైడీఏ జాయింట్‌ డైరెక్టర్‌ నాగేశ్వరరావు, టీజీఐసీ ప్రతినిధి రమేశ్‌, కళాశాల సీఈఓ డాక్టర్‌ రోహిత్‌ కందకట్ల, ప్రిన్సిపాల్‌ సాయి సత్యనారాయణరెడ్డి, డీన్‌ సమ్యుక్త పెంటా, సీఈఓ వివేక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement