బాల్య వివాహాల నిర్మూలనకు కృషి | - | Sakshi
Sakshi News home page

బాల్య వివాహాల నిర్మూలనకు కృషి

Nov 29 2026 11:53 AM | Updated on Nov 29 2026 11:53 AM

షాబాద్‌: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి క్కరూ కృషి చేయాలని ఎంపీడీఓ అపర్ణ పేర్కొన్నారు. శనివారం మండల పరిషత్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆశ్రిత ఎన్జీఓ సంస్థ ఆధ్వర్యంలో బాల్యవివాహాల నిర్మూలనపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని సూచించారు. బాల్యవావాహాలను అరికట్టడంలో గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, కార్యదర్శులు కీలక పాత్ర పోషించాలని తెలిపారు. గ్రామాల్లో బాల్యవివాహాలు జరగకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీఓ నాసరయ్య, ఎంఈఓ లక్ష్మణ్‌నాయక్‌, ఎస్‌ఐ చెన్నారెడ్డి, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ విమల, ఆశ్రిత, ఎన్జీఓ సంస్థ ప్రతినిధులు మాధవీరెడ్డి, గీత, దశరథ, యశోద, వీరబాబు, సర్పంచులు, కార్యదర్శులు, అంగన్‌వాడీ టీచర్లు, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.

ఎంపీడీఓ అపర్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement