బాలల హక్కులు, భద్రతపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

బాలల హక్కులు, భద్రతపై ప్రత్యేక దృష్టి

Nov 29 2026 11:53 AM | Updated on Nov 29 2026 11:53 AM

షాబాద్‌: బాలల హక్కులు, భద్రతకు అందరూ కృషి చేయాలని జిల్లా అధికారి భాను ప్రకాశ్‌ పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని మన్‌మర్రి గ్రామంలో బాలల హక్కుల పరిరక్షణ, వారి సమగ్ర అభివృద్ధి, భద్రతే లక్ష్యంగా గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్యవివాహాల నిర్మూలన, బాల కార్మిక వ్యవస్థ నివారణ, లింగ వివక్షకు అడ్డుకట్ట వేయడం, అక్రమ దత్తతలు, బాలల భిక్షాటనను నిరోధించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. బడి మానేసిన పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించాలని, ప్రతి బాలబాలికలకు విద్య, ఆరోగ్యం, రక్షణ, సమాన హక్కులు కల్పించేలా గ్రామస్థాయిలో అందరూ బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామ సర్పంచ్‌ లాలపేట్‌ బంధయ్య మాట్లాడుతూ.. గ్రామంలోని పిల్లలు ఎదుర్కొనే సమస్యలను కమిటీ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఎంలు దశరథరెడ్డి, మర్పల్లి అశోక్‌, అంగన్‌వాడీ టీచర్‌ గిరిజ, వార్డుసభ్యులు నర్సింలు, వెంకటేశ్‌, ఆశాకార్యకర్త వనజ, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement