చికిత్స పొందుతూ వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

Nov 2 2026 9:06 AM | Updated on Nov 2 2026 9:06 AM

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి గెలుపే లక్ష్యంగా పని చేయాలి

చేవెళ్ల: ప్రమాదవశాత్తు గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి ఆదివారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన ప్రకారం.. మిర్జాగూడ గ్రామానికి చెందిన గల్ల యాదయ్య(57) గత నెల 25న రాత్రి వేళ నడుచుకుంటూ వెళ్లి పోచమ్మ గుడి సమీపంలోని గుంతలో పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని చేవెళ్లలోని మహేందర్‌రెడ్డి ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడి కుమారుడు రాఘవేందర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

మంచాల: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో పార్టీ మండల అధ్యక్షుడు రమేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో పని తీరుకు ఎన్నికలే గీటు రాయన్నారు. పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో గ్రాడ్యుయేట్లందరూ ఓటు హక్కు పొందేలా చూడాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్‌ వెంకట రమణారెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ చంద్రయ్య, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ పుల్లారెడ్డి, ఎంపీపీ మాజీ సభ్యురాలు ఇందిర, జాపాల సర్పంచ్‌ రవి, యువజన విభాగం మండల అధ్యక్షుడు భద్రినాథ్‌ గుప్తా, నాయకులు కిషన్‌రెడ్డి, రఘుపతి, శేఖర్‌, జంగారెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, భిక్షపతి, కరుణాకర్‌రెడ్డి, సతీష్‌, చంద్రకాంత్‌, వీరేష్‌, జంగయ్య, సుదర్శన్‌, బాలరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఢిల్లీ రాంలీలా మైదానానికి తరలిన నాయకులు

శంకర్‌పల్లి: దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన బహిరంగ సభకు శంకర్‌పల్లి నుంచి భారీగా కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు తరలివెళ్లారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. శంకర్‌పల్లి నుంచి డీసీసీ ఉపాధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, శంకర్‌పల్లి, మోకిల పీఏసీఎస్‌ చైర్మన్లు బొల్లారం వెంకట్‌రెడ్డి, సత్యం, పార్టీ మున్సిపల్‌ అధ్యక్షుడు చంద్రమౌళి, మోకిల సర్పంచ్‌ చిట్టెంపల్లి శేఖర్‌, నాయకులు వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement