సీసీ కెమెరాల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

సీసీ కెమెరాల పాత్ర కీలకం

Nov 2 2026 9:06 AM | Updated on Nov 2 2026 9:06 AM

సీసీ కెమెరాల పాత్ర కీలకం విద్యుత్‌ షాక్‌తో గేదె మృతి ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి తొమ్మిది రోజుల వ్యవధిలో తల్లీకొడుకుల మృతి

కుల్కచర్ల ఎస్‌ఐ రమేష్‌

కుల్కచర్ల: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో కీలకమని కుల్కచర్ల ఎస్‌ఐ రమేష్‌ అన్నారు. ఆదివారం మండలంలోని బండవెల్కిచర్ల గ్రామంలో సీసీ కెమెరాల ఉపయోగం, సైబర్‌ క్రైం, దొంగతనాలు, మహిళలపై వేధింపులు తదితర నేరాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు ఉంటే గ్రామంలోకి వచ్చిపోతే ప్రతి ఒక్కరిపై నిఘా ఉంటుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మడుగు శ్రీనివాస్‌, పాంబండ ఆలయ చైర్మన్‌ కోట్ల మైపాల్‌ రెడ్డి, ఉప సర్పంచ్‌ గోవర్ధన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పూడూరు: విద్యుత్‌ షాక్‌కు గురై గేదె మృతి చెందిన ఘటన మండలంలోని శేరిగూడ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. సుజాతకు చెందిన గేదె పొలంలో మేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. గేదె విలువ సుమారు 1.60 లక్షల వరకు ఉంటుందని ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె కోరారు.

టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు

గోపాల్‌నాయక్‌

కొత్తూరు: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, పరిష్కరించాలని టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు గోపాల్‌నాయక్‌ డిమాండ్‌ చేశారు. కొత్తూరులో ఆదివారం నిర్వహించిన మండల నూతన కమిటీ ఎన్నికలో ఆయన పాల్గొన్నారు. అధ్యక్షుడిగా గౌరయ్య, ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్‌రావు, ప్రధాన కార్యదర్శిగా ప్రిన్స్‌, కోశాధికారిగా లక్ష్మితో పాటు పలువురు సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ నివేదకను వెంటనే అమలు చేయాలన్నారు. జీవోలో భాగంగా స్థానికతను కోల్పోయి ఇతర జిల్లాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు రఘుపాల్‌, రాజ్‌కుమార్‌, భాస్కర్‌రావు, నివిత, అనూష, స్వాతి, తదితరులు పాల్గొన్నారు.

పోల్కంపల్లిలో విషాదం

ఇబ్రహీంపట్నం రూరల్‌: తొమ్మిది రోజుల వ్యవధిలో తల్లీకొడుకులు మృతి చెందడంతో బాధిత కుటుంబ గుండెలు బాదుకుంటోంది. వివరాలు ఇలా ఉన్నాయి.. పోల్కంపల్లికి చెందిన పూల భిక్షపమ్మ (52) అనారోగ్యం బారిన పడి కొన్నేళ్లుగా మంచానికే పరిమితమైంది. ఈక్రమంలో తొమ్మిది రోజుల క్రితం చనిపోయింది. అప్పటికే ఆమె కొడుకు శంకర్‌ (32) ఆరోగ్యం బాగోలేక గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తల్లి అంత్యక్రియల కోసం తీసుకువచ్చి, తిరిగి ఆస్పత్రిలో చేర్పించారు. శనివారం భిక్షపమ్మ దశదినకర్మ ఉండగా, శంకర్‌ కోలుకోకపోవడంతో వాయిదా వేశారు. ఆస్పత్రిలో ఉన్న ఆయన ఆదివారం మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. ఇంటి పెద్దలను కోల్పోయి, మన్నీరుమున్నీరవుతున్నారు.

మైనార్టీ విభాగం జిల్లా

అధ్యక్షురాలిగా రషియాబేగం

షాద్‌నగర్‌: తెలంగాణ రక్షణ సేన ముస్లిం మైనార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన రషియా బేగంను నియమించారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం రషియాబేగం పార్టీ అధ్యక్షురాలిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు కృషిచేస్తానని రజియాబేగం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement