మొండిగౌరెల్లి అసైన్డ్ రైతులకు విడతల వారీగా పరిహారం చెక్కులు అందజేస్తాం. అభ్యంతరం లేని భూములకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆక్రమణ, నకిలీలపై చర్యలు తీసుకుంటాం. కుటుంబ వివాదాలకు సంబంధించి సయోధ్య కుదిరితే రికార్డులు పరిశీలించి, చెక్కులు ఇస్తాం.
– శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీఓ ఇబ్రహీంపట్నం
అసైన్డ్ భూములు కోల్పోయి పరిహారం పొందే రైతులు డబ్బులను జాగ్రత్తగా వాడుకోవాలి. దూరం వెళ్లినా సరే వచ్చిన డబ్బులతో ఎకరా లేదా అరఎకరా అయినా భూమినే కొనుగోలు చేయాలి. డబ్బులు వచ్చాయని ఆర్భాటాలు, జల్సాలకు వెళితే కుటుంబాలు రోడ్డున పడుతాయి.
– కోలన్ రమాదేవి, సర్పంచ్ మొండిగౌరెల్లి


