పట్టభద్రుల ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

పట్టభద్రుల ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి

Nov 2 2026 9:06 AM | Updated on Nov 2 2026 9:06 AM

కేశంపేట: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో పట్టభద్రుల ఓటరు నమోదుపై బీజేపీ కార్యకర్తలు ప్రత్యేక దృష్టి పెట్టాలని మండల అధ్యక్షుడు పాలాది శ్రీనివాస్‌ అన్నారు. మండల కేంద్రంలో నాయకులతో కలిసి ఎమ్మెల్సీ ఓటరు నమోదు, అమిత్‌షా ర్యాలీ విజయవంతంపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్ధిని గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. గ్రామాల్లో అర్హులైన ప్రతీ ఒక్కరికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఉండే విధంగా చూడాలని చెప్పాప. కార్యకర్తలు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలని ఆయన కోరారు. అలాగే హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన అమిత్‌షా ర్యాలీకి మండలం నుంచి అధిక సంఖ్యలో నాయకులు తరలివచ్చే విధంగా చూడాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు వడ్డె చంద్రయ్య, సొప్పరి నర్సింహ, మున్నూరు యుగంధర్‌, కంపుకోట నర్సింహ, అంజయ్య, కానం ఉదయ్‌గౌడ్‌, మోటే శ్రీనివాసులు, భక్తవత్సలం, వెంకటేశ్‌, నర్సింగ్‌, రాజు, తట్టెపల్లి నర్సింహ, సాయి, మణికంఠ, యాదగిరి, తిరుపతి, వేణు, రాకేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement