కడ్తాల్: భక్తిభావంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధి చల్లంపల్లిలో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన లక్ష్మీ సుదర్శన మహాయాగంలో ఆయన పూజలు చేశారు. అనంతరం యాగ నిర్వాహకులను సుంకిరెడ్డి సన్మానించారు. కార్యక్రమంలో ఆధ్యాత్మిక గురువు రవికృష్ణశర్మ, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, ఫౌండేషన్ సభ్యులు మాజీ సర్పంచ్ శ్రీరాములు, నరేందర్‌గౌడ్, తల్లోజు రఘు, శివ తదితరులు పాల్గొన్నారు.
ఆలయ అభివృద్ధికి విరాళం
మండల పరిధి ముద్వీన్ లక్ష్మీ నర్సింహస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ నాయకుడు, టాస్క్ సీఓఓ, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్వామివారం ఆలయాన్ని సందర్శించారు. ఆలయ కమిటీ సభ్యుల కోరిక మేరకు ఆలయ ప్రాంగణంలో రేకుల షెడ్డు నిర్మాణానికి రూ.2 లక్షల చెక్కును విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దాతకు కమిటీ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ సంధ్య, వార్డు సభ్యులు మల్లేశ్, శ్రీను, మంకాల శ్రీను, కృష్ణ, జంగయ్యయాదవ్, శ్రీను, వినోద్, మధు, వెంకటేశ్, సురేశ్, సైదులు తదితరులు ఉన్నారు.


