హామీల అమలులో ప్రభుత్వం విఫలం | - | Sakshi
Sakshi News home page

హామీల అమలులో ప్రభుత్వం విఫలం

Nov 2 2026 9:06 AM | Updated on Nov 2 2026 9:06 AM

ఆమనగల్లు: ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని కల్వకుర్తి ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి రజిని ఆరోపించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసిందని విమర్శించారు. నిరుద్యోగ భృతిని వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం పట్టణంలో మిషన్‌ భగీరథ మాజీ వైస్‌ చైర్మన్‌ ఉప్పల వెంకటేశ్‌ ఆధ్వర్యంలో ఓటు నమోదు కేంద్రాన్ని ప్రారంభించారు. గ్రాడ్యుయేట్లందరూ తమ ఓటును నమోదు చేసుకోవాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ కౌన్సిలర్‌ పాపిశెట్టి రాము, రమేశ్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీశైలం, బాలస్వామి, సైదులుగౌడ్‌, రమేశ్‌, కిరణ్‌, గోపి, ప్రశాంత్‌నాయక్‌, పంతునాయక్‌, సాలయ్య, చందు, అశ్విన్‌, కిరణ్‌, మహేశ్‌, శ్రీకాంత్‌, శేఖర్‌, రాజు, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు శ్రీనునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

కల్వకుర్తి ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి రజిని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement